Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 January 2026, 6:07 pm Posted by : ramakrishna

చైల్డ్ వెల్పేర్ చైర్ పర్సన్ ను సన్మానించిన ఆపరేషన్ స్మైల్ బృందం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

 

చైల్డ్ వెల్పేర్ కమిటీ చైర్ పర్సన్ సంపూర్ణను నిజామాబాద్ ఆపరేషన్ స్మైల్ బృందం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శుక్రవారం నిజామాబాద్ ఆపరేషన్ స్మైల్ బృందం నిజామాబాద్ రోడ్లపై తిరుగుతున్న ఇద్దరు బాల కార్మికులను పట్టుకొని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. దీంతో చైల్డ్ కమిటీ వారు పట్టుబడ్డ బాల కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం సావిత్రిబాయి పూలే అవార్డుతో ఆపరేషన్ స్మైల్ బృందం వారు చైల్డ్ వెల్పేర్ కమిటీ చైర్ పర్సన్ సంపూర్ణను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజేశ్వర్, పోలీస్ కానిస్టేబుల్ రాములు, బలరాం,  సుజాత, కోఆర్డినేటర్ మధుసూదన్, చైల్డ్ సిబ్బంది పాల్గొన్నారు.