- తిరంగా యాత్రకు బీజేపీ సంపూర్ణ మద్దతు
- బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్, బతుకమ్మ : ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని, తిరంగా యాత్రకు బీజీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బీజీపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి పేర్కొన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత కు అంకితమైన మన భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం పట్ల గర్వంగా గౌవరంగా భావిస్తున్నానన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శక్తి వంతమైన నాయకత్వం లో భారత్ తమ ప్రజల రక్షణ కోసం ఎటువంటి అపాయాన్ని కూడ భరించదని అవసరమైతే సమర్తవంతగా ప్రతి స్పందించగలదని మరోసారి ప్రంపంచానికి చాటి చెప్పిందని తెలిపారు. ఈ విజయనికి కారకులైన ప్రతి జవాన్ కు వారి కుటుంబాలకు ఇందూరు ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ పార్టీ గా తాము దేశ భద్రతను అత్యునత ప్రాధాన్యత గా తీసుకుంటామన్నారు. దేశ శత్రువులకు గట్టి బుద్ధి చెప్పిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా పూర్తికావడం భారతదేశానికి గర్వకారణమని, ఈ నేపథ్యంలో జాతీయ గౌరవాన్ని స్మరించుకునేలా సోమవారం ఇందూరు పట్టణంలో “సిటిజెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ” ఆధ్వర్యంలో నిర్వహించనున్న తిరంగా యాత్రకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి వెల్లడించారు. “భారత సైన్యం చరిత్రలో మరో గర్వకారణమైన ఘట్టంగా నిలిచిన ఆపరేషన్ సిందూర్ దేశానికి గౌరవాన్ని తెచ్చిందని తెలిపారు. ఈ విజయం వెనుక ఉన్న సైనికుల ధైర్యం, దేశభక్తి పట్ల ప్రతి పౌరుడిలో గౌరవం కలగాల్సిన అవసరం ఉందన్నారు. మన యువతలో జాతీయతను ప్రేరేపించాలనే సంకల్పంతో ఈ తిరంగా యాత్రను బీజేపీ సంపూర్ణంగా సమర్థిస్తుందని తెలిపారు. పైల్గాం ఘటనలో ఉగ్రవాదులు భారతీయుల పై చేసిన దారుణ హత్యలు దేశం మర్చి పొదన్నారు. ఈ యాత్రలో జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతలు, బీజేవైఎం కార్యకర్తలు, మహిళా మోర్చా సభ్యులు, విద్యార్థి సంఘాలు, వివిధ సామాజిక సంఘాలు, జవాన్ల కుటుంబ సభ్యులు, మాజీ సైనికులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రతి భారతీయుడు ఈ యాత్ర లో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశం లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకర్ లక్ష్మి నారాయణ,రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, కార్పొరేటర్ ప్రమోద్, మాస్టర్ శంకర్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్,ఓం సింగ్,అంబదాస్ రావు, మల్లేష్ గుప్తా,అమంద్ విజయ్ కృష్ణ,బూపతి,కస్తూరి కృష్ణ,కిషన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.