Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 September 2025, 7:13 pm Posted by : ramakrishna

ఆపరేషన్ సింధూర్ స్వచ్ఛభారత్ చిత్రలేఖన పోటీలు

  • ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలు

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని( సేవాపక్షం) కార్యక్రమాలలో భాగంగా బీజేపీ ఎల్లారెడ్డిపేట మండల మహిళా మోర్చా ఆధ్వర్యంలో విజ్ఞాన్ పాఠశాలలోగురువారం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు.ఈ పోటిల్లో 20 మంది విద్యార్థిని,విద్యార్థులు పాల్గొని ఆపరేషన్ సింధూర్ స్వచ్ఛభారత్ పహాల్గాం దాడిని చిత్రీకరించి మంచి ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ, గంభీరావుపేట మండల అధ్యక్షురాలు జమున, జిల్లా కార్యదర్శి రజిత,బూత్ అధ్యక్షురాలు స్వరూప, తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు.