Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 August 2025, 4:42 pm Posted by : ramakrishna

ఆపరేషన్ ముస్కాన్ – 11లో 154 మంది చిన్నారులను రక్షించిన పోలీస్ శాఖ

  • కమిషనరేట్  పరిధిలో 39 ఎఫ్ఐఆర్ లు నమోదు
  • పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ -11 లో భాగంగా 154 మంది చిన్నారులను కాపాడి 39 మందిపై కేసులు నమోదు చేసినట్లు సిపి పోతరాజు సాయి చైతన్య తెలిపారు. కమిషనరేటు పరిధిలో ” ఆపరేషన్ ముస్కాన్  11 లో భాగంగా  జులై 1 నుంచి 31 వరకు కొనసాగిందని తెలియజేశారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ ముఖ్య ఉద్దేశ్యం 18 సం॥రాలలోపు తప్పిపోయిన / వదిలివేయబడిన /కార్మికులుగా ఉన్న బాలబాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం సేకరించి వారితో పనిచేయించిన యాజమానిపై కేసు నమోదు చేయడం కాని లేదా వారి తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ చేసి అప్పగించడం జరిగిందని తెలిపారు. తల్లి దండ్రులు లేని వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటి (సి.డబ్ల్యూ.సి) వారికి అప్పజెప్పడం జరుగు తుంది. అలాగే తల్లిదండ్రులు ఉన్న పిల్లల్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటి ముందు హజరుపరిచి వారి ఆదేశాల మేరకు వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరుగిందన్నారు. నిజామాబాద్ కమీషనరేటు పరిధిలో గల నిజామాబాద్ 56 మంది చిన్నారులు, ఆర్మూర్ 42, బోధన్ డివిజన్ లో 56 మంది మొత్తం 154 మంది (148 మంది మగపిల్లలు ,6 మంది ఆడపిల్లలు) పిల్లలను రెస్క్యూ  చేయడం  జరిగిందని తెలిపారు. అలాగే కమీషనరేటు పరిదిలో నిజామాబాద్ డివిజన్ పరిధిలో 15 ఎఫ్.ఐ.ఆర్ లు, ఆర్మూర్ డివిజన్ పరిధిలో 12 ,బోధన్ డివిజన్ పరిధిలో 9ఎఫ్.ఐ.ఆర్  లు  మొత్తం 36 ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం జరిగిందని సిపి తెలిపారు.