ఖనిజ సంపదను దోచిపెట్టేందుకే ఆపరేషన్ కగార్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: కార్పొరేట్ శక్తులకు ఖనిజ సంపదను దోచిపెట్టేందుకే ఛత్తీస్ గఢ్ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని సీపీఐ జిల్లా కారయద్శి పి సుధాకర్ విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో మావోయిస్టులను, వామపక్ష భావజాలాన్ని అంతం చేయడమే లక్ష్యంగా బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ చేపట్టి బూటకపు ఎన్ కౌంటర్లు చేయిస్తున్నారన్నారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి తాము సిద్ధమని మావోయిస్టులు...