నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: కార్పొరేట్ శక్తులకు ఖనిజ సంపదను దోచిపెట్టేందుకే ఛత్తీస్ గఢ్ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని సీపీఐ జిల్లా కారయద్శి పి సుధాకర్ విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
దేశంలో మావోయిస్టులను, వామపక్ష భావజాలాన్ని అంతం చేయడమే లక్ష్యంగా బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ చేపట్టి బూటకపు ఎన్ కౌంటర్లు చేయిస్తున్నారన్నారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి తాము సిద్ధమని మావోయిస్టులు బహిరంగంగానే తెలిపినప్పటికీ, కార్పొరేట్ శక్తులకు అడవిలోని ఖనిజ సంపదను దోచిపెట్టేందుకు దుర్మార్గపు వైఖరిని ప్రదర్శిస్తూ మావోయిస్టులతోపాటు ఆదివాసులపై బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తున్నారని అన్నారు.
ఆపరేషన్ కగార్ పై స్వతంత్ర న్యాయవిచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా నాయకులు ముత్యాలుహనుమండ్లురంజిత్ఫిరోజ్ అలీ తదితరులు పాల్గొన్నారు.