వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని రామన్నపేట్ గ్రామంలో ఇందిరా క్రాంతి పథం ఆధ్వర్యంలో గురువారం వరి దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం అయ్యింది. మండల ఐకేపీ ఏపీఎం మాణిక్యం కొనుగోలు కేంద్రాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో జీ. పీ సెక్రటరీ రమేష్, ఐకేపీ సీసీ ప్రకాష్,టీ జీ బి మేనేజర్ చంద్రకాంత్ రెడ్డి, సీ. ఏలు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.