కనువిప్పు.. ఎవరికి..?

జిల్లాలో జోరుగా చర్చ   నిజామాబాద్, బతుకమ్మ: గల్ప్ బాధితుల సమస్యలను పట్టించుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాల్కొండ నియోజకవర్గంలో మంటలు పుట్టించిన విషయం తెల్సిందే. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు సవాళ్ళు, ప్రతిసవాళ్లు విసురుకున్న విషయం విధితమే. విపక్ష పార్టీ నాయకులకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ప్ బాధితులను పట్టించుకున్న వారి జాబితాతో సిద్దమని చెబుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, తెలంగాణ సహకార సొసైటీ యూనియన్ చైర్మన్ మానాల...