ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీ ప్రకటన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్ఎస్సీ, ఇంటర్ థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీలను ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26వరకు జరుగుతాయని తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించిన వారికి జిల్లాలోని ఏఐ, కో ఆర్డనేటర్స్, అసిస్టెంట్ కో ఆర్ఢినేటర్స్, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ సకాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా, చరవాణి ద్వారా తెలియజేసి పరీక్షలకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ పరీక్షలు ఉదయం 9నుంచి మధ్యాహ్నం...