Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2024, 3:07 pm Posted by : ramakrishna

ఓపెన్ స్కూల్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ 

బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్  హైస్కూల్లో మండల విద్యాశాఖ అధికారి రాజ్ గంగారెడ్డి ఓపెన్ స్కూల్ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండిన వారు ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతిలో అడ్మిషన్ పొందవచ్చు అన్నారు.  10వ తరగతి పాస్ అయిన వారు ఓపెన్ విధానంలో పాస్ అయినవారికి రెగ్యులర్ విధానంలో పాస్ అయిన వారితో సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు. ఈ సర్టిఫికెట్ అన్ని విద్యార్హతలకు ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ తులా రవీందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Open School Wall Poster Invention