దుబ్బాక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమం

బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని దుబ్బాక ఎస్ఐ గంగరాజు, సిబ్బందితో కలసి ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు మంగళవారం అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా పోలీసులు నిర్వహిస్తున్న విధుల గురించి, పోలీస్ స్టేషన్ ఫంక్షన్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ రూమ్, రైటర్ రూమ్, లాకప్, రిసెప్షన్,  పోలీసులు ఉపయోగిస్తున్న ఆయుధాల గురించి, నూతన చట్టాల గురించి, టెక్నాలజీ గురించి, విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్ఐ గంగరాజు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాల...