Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 September 2025, 5:29 pm Posted by : ramakrishna

పక్షం రోజులు సేవా కార్యక్రమాలే నిర్వహించాలి

  • జిల్లా పార్టీ సెక్రటరీ నోముల నర్సారెడ్డి

భీమ్ గల్, బతుకమ్మ : భారత ప్రధాని మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 17 నుండి వచ్చే నెల 2 గాంధీ జయంతి వరకు పక్షం రోజులు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా బీజేపీ సెక్రటరీ నోముల నర్సారెడ్డి అన్నారు.సోమవారం మండలం కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు ఆరే రవీందర్ అధ్యక్షతన  సేవా పక్షం కార్యశాల నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ఆయన కార్యక్రమాన్ని ప్రసంగించారు. మన ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఇ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు సేవా పక్షంగా వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు.17న నాడు రక్త దాన శిబిరం ఏర్పాటు ,18 నాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాలని,25 నాడు దీన్ దయాళ్ జీ కి నివాళులు అర్పించి మొక్కలు నాటాలని,28 నాడు విశిష్ట వ్యక్తులకు సన్మానం,అక్టోబర్ 2 నాడు గాంధీ జీ లాల్ బహదూర్ శాస్త్రిల చిత్ర పాటలకు పుష్పాంజలి ఘటిస్తూ, స్వదేశీ ఖాదీ వస్త్రాల కొనుగోలు చేయాలని మార్గ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు ఆరే రవీందర్ మాట్లాడుతూ కారణ జన్ముడైన నరేంద్ర మోడీ పుట్టిన రోజు ఈనెల 17వ తేదీ నాటి నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు 15 రోజులు భీంగల్ మండలంలో వివిధ సేవా కార్యక్రమాలను జిల్లా పార్టీ సూచన మేరకు బీజేపీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆదేశానుసారం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలుపుతూ అన్ని గ్రామాలలో ఈనెల 17వ తేదీ నాడు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు భూఖ్య మోహన్,ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, కార్యదర్శులు లక్ష్మీనారాయణ,రజినీకాంత్, ఎస్టీ మోర్చా అధ్యక్షులు లింబాద్రి నాయక్, సీనియర్ నాయకులు గంగాధర్ గౌడ్,సిహెచ్ రాజేశ్వర్, దేవి శెట్టి శ్రీనివాస్,బద్దం సుజిత్ రెడ్డి, శక్తి లక్ష్మణ్,కొట్టాల అశోక్, భదావత్ ప్రకాష్ నాయక్,సుదర్శన్, తోట రమేష్,లింబాద్రి నాయక్, లింబన్న,ప్రభాకర్, సురేష్ నాయక్,మండల పదాదికారులు మబూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.

Only service programs should be held fortnightly.