జుక్కల్ ప్రజావాణికి ఒక్క దరఖాస్తు మాత్రమే…
జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ ఎమ్మార్వో కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఈ సోమవారం ఒక్క దరఖాస్తు మాత్రమే స్వీకరించబడింది. ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో రాము, మహిళా సంఘం అధికారులు, హౌసింగ్ శాఖ అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఇతర శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో ప్రజావాణి నిర్వహణపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజావాణిలో పాల్గొన్న ఆయిల్‌వార్ గ్రామానికి చెందిన రవి తన సమస్యను అధికారుల దృష్టికి...