. . . ఉగాది క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేదారనంద స్వామి
నందిపేట్, బతుకమ్మ :
సనాతన ధర్మం లో ఉగాది పండుగ మన హిందువులకు నూతన సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరూ ఉగాది నుండి ఉగాది వరకు క్యాలెండర్ లను వాడాలని కేదారనందగిరి స్వామి సూచించారు. నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీ రామ్ హనుమాన్ సేన ఆధ్వర్యంలో నందిపేట్ పల్గుట్టలోని కేదారేశ్వర ఆశ్రమం లో కేదారనందగిరి స్వామి వారి చేతుల మీదుగా ఉగాది క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సంస్కృతిని పాటించాలని అన్ని దేవాలయాల్లో, ఆశ్రమాల్లో ఉగాది నుండి ఉగాది వరకు క్యాలెండర్ మాత్రమే వాడాలని కోరారు. అనంతరం శ్రీ రామ్ హనుమాన్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లేర్ల శేఖర్, సేన సభ్యులు చేస్తున్న ధర్మ రక్షణ, ధర్మ ప్రచార కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమoలో శ్రీ రామ్ హనుమాన్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరి పన్నంవార్, యోగధారణ ఫౌండేషన్ వ్యస్థాపకులు ఉదయ్ మహారాజ్, బాలాజీ తదిరతులు పాల్గొన్నారు.