Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 8:21 pm Posted by : ramakrishna

క్యాలిఫయర్ కు చేరిన ఆన్ లైన్ బెట్టింగ్

 

. . . ఫైనల్ ముంగిట జోరుగా బెట్టింగ్

 

. . . జోరుగా యూపీఏ చెల్లింపులు . . . ఐడీల కేటాయింపులు

 

. . . కోట్లలో చేతులు మారుతున్న వైనం

 

. . . చోద్యం చూస్తున్న నిఘా వర్గాలు

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. మార్చి చివరి వారంలో ప్రారంభమైన ఐపీఎల్ -19వ సీజన్ లో 74 మ్యాచ్ లు లక్ష్యంగా టోర్ని జరుగుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ నెల 31న ఫైనల్ జరుగనుండగా క్వాలి ఫయర్ మ్యాచ్ లు ఉత్కంఠత రేపుతున్నాయి. అదే సమయంలో క్రికెట్ ఆన్ లైన్ బెట్టింగ్ నిజామాబాద్ జిల్లాలో జోరుగా సాగుతుంది. జిల్లా కేంద్రం మొదలుకుని బోధన్, ఆర్మూర్, భీంగల్, మున్సిపాలిటీలతో పాటు మండల కేంద్రాల్లోనూ ఐడీల కేటాయింపు, ఆన్ లైన్ బెట్టింగ్ జోరందుకుంది. క్రికెట్ టోర్ని ప్రారంభమైనప్పుడు  హడావుడి చేసిన నిఘా వర్గాలు తరువాత చల్లబడ్డాయి. దానితో ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వాహుకులకు కాసుల పంట పండుతుంది. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ సీజన్ లోనే కార్లు కొనడం, బంగ్లాలు కట్టేస్తున్నారని చర్చ జరుగుతుంది.

 

Online betting that reached the qualifiers

 

నిజామాబాద్ నగరంలో ఆన్ లైన్ బెట్టింగ్ సూత్రదారైన సైకిల్ చోర్ కేసు నిందితుడు ఆధ్వర్యంలో ఆన్ లైన్ బెట్టింగ్ ఓవర్ ఓవర్ కు, ఆరు బాళ్లు. . . 20 రన్నులు అన్న చందంగా సాగుతుంది. నిజామాబాద్ నగరంలో గతంలో దొరికిన మరొక సూత్రదారి ముజాహిద్ నగర్ కు చెందిన డైరీ నిర్వాహకుడి ముసుగులో కొనసాగుతునే ఉంది. నగరంలోని 1వ టౌన్ పరిధిలో స్నూకర్ పూల్ వద్ద జరిగిన ఘర్షణలో హత్యాయత్నం కేసులో నిందితులు కూడా ఐడీల జారీలో తలమునకలయ్యారు. మజ్లీస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ తనయుడు, కార్పొరేటర్ క్యాంప్ కార్యాలయం అడ్డాగానే బెట్టింగ్ లు నిర్వహిస్తున్న నిఘా వర్గాలు నిద్రపోతున్నాయనే విమర్శలున్నాయి. ఈ సీజన్ లోనే లక్షల నుంచి కోట్లు సంపాదించాలన్న లక్ష్యంతో ప్రధాన సూత్రదారులు ఐడీల కేటాయింపుల కోసం సబ్ ఏజంట్లను గల్లీల మొదలుకుని మండలాల వారీగా నియమించుకుని బెట్టింగ్ నిర్వాహణను గ్రౌండ్ స్థాయికి విస్తరించారు. దానితో సామాన్యులు మొదలుకుని యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు ఆన్ లైన్ బెట్టింగ్ లో నిమగ్నమయ్యారు.

 

Online betting that reached the qualifiers

 

నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న ఆన్ లైన్ బెట్టింగ్ వ్యవహరం కోట్లలో చేరిందనే టాక్ నడుస్తోంది. వైన్ షాప్ లలో క్లీనర్ గా పని చేసిన వారే సఫారీ కార్లలో తిరిగేంతగా సంపాదించారని చెబుతున్నారు. రైల్వేస్టేషన్ వద్ద, పాన్ షాప్ లలో బీడీల కొనుగోలు చేసే స్టేషన్ ప్రాంగణంలో అమ్మిన వారు ఇప్పుడు విల్లాలు కట్టుకునే స్థాయికి ఎదిగారంటే అంతా ఆన్ లైన్ బెట్టింగ్ మహిమనే అని చెబుతున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ ప్రారంభమైనప్పుడే నిఘా వర్గాలకు దోస్తానా చేసి స్థానిక స్టేషన్ల ఎస్సైలతో మిలాఖత్ అయ్యారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో ఎస్సైలుగా విధుల్లో చేరి ఉన్నత స్థాయికి ఎదిగిన వారి అండతోనే ఆన్ లైన్ బెట్టింగ్ మాఫియా రెచ్చిపోయిందన్న విమర్శలు లేకపోలేదు. 2012 నుంచి జిల్లాలో పని చేసిన ఎస్సైల ద్వారా నెట్ వర్క్ ను విస్తరించుకుని వారికి ఇక్కడి నుంచి వారి సొంతూళ్ళకు దేశీ చికెన్, మటన్ సప్పాలు పార్సల్ గా పంపించడంలో సంబంధిత బ్యాచ్ దిట్ట. ఏకంగా ఆన్ లైన్ బెట్టింగ్ కీలక సూత్రదారి ఫోన్ నంబర్ ను ఎస్సైలు అన్న అని ఫీడ్ చేసుకోవడంతో ఆ ఫోన్ రాకతోనే బెట్టింగ్ వ్యవహరాలను చక్కబెడుతున్నారన్న వాదనలు లేకపోలేదు. అందుకే కోట్లలో లావాదేవీలు జరిగిన రోజువారిగా మ్యాచ్ లు రెండు నెలలుగా జరుగుతున్నా కీలక సూత్రదారులు పట్టుబడడం లేదంటే ఎంతగా నెట్ వర్క్ విస్తరించిందో చెప్పకనే చెబుతుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ వరకు కోట్ల సంపాదన లక్ష్యంగానే బెట్టింగ్ సాగుతుందని చెప్పాలి.

 

Online betting that reached the qualifiers