Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2024, 6:34 pm Posted by : ramakrishna

దేశంలో ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనం తీవ్రమైన సమస్యగా మారింది

  •  ప్రముఖ మానసిక వైద్యులు విశాల్ ఆకుల

Online betting addiction has become a serious problem in the countryభారతదేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం ఒక తీవ్రమైన సమస్యగా మారింది అని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ,తెలంగాణ స్టేట్ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ విశాల్ ఆకుల తెలిపారు. వివిధ వయసుల ప్రజలు, ముఖ్యంగా యువత, ఈ ప్రమాదకరమైన జూద వ్యసనానికి బలైపోతున్నారు. ఈ వ్యసనం వారి వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపుతూ సమాజంలో అనేక సమస్యలకు దారితీస్తోంది.ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ బ్రాంచ్ వార్షిక సదస్సును ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ (ఎఐజి)హాస్పిటల్‌లో ఘనంగా నిర్వహించారు. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ అంశంపై ప్రత్యేక ప్యానల్ చర్చను కూడా ఏర్పాటు చేశారు.ఈ చర్చలో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్ జోన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జార్జ్ రెడ్డి, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ అకుల, ఇతర వైద్యులు ఆన్‌లైన్ బెట్టింగ్,  గేమింగ్ కారణంగా ఏర్పడే లక్షణాలు, ఈ వ్యసనానికి కారణాలు. కోగ్నిటివ్ బిహేవియర్ థెరపీ,కౌన్సెలింగ్, నూతన చికిత్సా విధానాల గురించి వివరణ ఇచ్చారు. డాక్టర్ మన్మోహన్ రాజు, డాక్టర్ శ్రీధర్ దండపల్లి కూడా అవగాహన కల్పించారు. ఈ ప్యానల్ చర్చకు మోడరేటర్లుగా డాక్టర్ కిషన్, డాక్టర్ గంగారాం వ్యవహరించారు. ఈ అవకాశాన్ని కల్పించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డికి, ఎఐజి హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వర రెడ్డి కి డాక్టర్ విశాల్ ఆకుల ధన్యవాదాలు తెలిపారు.