బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రంలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఆవరణలో భూభారతి రెవెన్యూ సదస్సు ను మండల తాసిల్దార్ మల్లయ్య ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా మండల తాసిల్దార్ మల్లయ్య మాట్లాడుతూ గ్రామ రైతులు పట్టా పాస్ బుక్కులో పేర్లు, సర్వే నంబర్,తప్పిదాలు, మరియు ప్రభుత్వ అసెస్మెంట్ భూముల సమస్యలపై దరఖాస్తు లు చేసుకోవాలని తెలిపారు. రెవెన్యూ సదస్సులో రైతుల నుండి భూముల సమస్యలపై 263 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈరెవిన్యూ సదస్సులో సీనియర్ అసిస్టెంట్ కిరణ్, ఆర్ ఐ సదానంద్, సర్వేయర్ అజయ్, జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ గౌడ్, మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
