Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2025, 6:45 pm Posted by : ramakrishna

కొనసాగుతున్న రంజాన్ ఉపవాస దీక్షలు

రుద్రూర్, బతుకమ్మ :  ముస్లిం ప్రజానీకం అత్యంత పవిత్రంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో  పాటించే రంజాన్ ఉపవాస దీక్షలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. మార్చి 1వ తేదీన నెలవంక దర్శనంతో  2వ తేదీ నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభించారు. మంగళవారం నాటికి పది రోజుల ఉపవాస దీక్షలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. వేకువ జామున 05:08 గంటలకు సహర్ తో ప్రారంభమయ్యే ఉపవాస దీక్ష సాయంకాలం 06:30 లకు ఇఫ్తార్ తో ఉపవాస దీక్షను విరమిస్తారు. సమత, మమతల సమ్మిళితాన్ని చాటిచెప్పే పవిత్రమైన పండుగ రంజాన్. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించడంతో ముస్లిం మైనార్టీలు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముస్లింలు రంజాన్ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉపవాస నియమాలు పాటిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఒకే పద్దతి, ఒకే విధమైన ఆరాధనతో నెల రోజులు గడుపుతారు. ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా ఈ రంజాన్ మాసం వారిలో నిజాయితీ, క్రమశిక్షణతో గడుపుతారు.నెల రోజుల ఉపవాసాల అనంతరం రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. నెలవంక దర్శనంతో దీక్షలు చేపట్టి తిరిగి నెలవంక దర్శనంతో దీక్షను విరమిస్తారు. ప్రతిరోజు రాత్రి ఆయా మజీదులలో తరహావి ఖురాన్ పఠనంతో ప్రత్యేక నమాజులు జరుగుతున్నాయి. రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని మసీద్ కమిటీలు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.