Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 April 2025, 3:21 pm Posted by : ramakrishna

కొనసాగుతున్న ఎన్ఎస్ ఎస్ శిబిరం

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండూర్ లో ఎన్ఎస్ ఎస్ శిబిరం కొనసాగుతోంది. మూడోరోజైన శనివారం గ్రామస్తులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన అందించిన సేవలను వివరించారు. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సహకారంతో గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సన్ రైజ్ ఆస్పత్రి సిబ్బంది, గ్రామస్తులు, ఎన్ఎస్ ఎస్ వలంటీర్లు, వీడీసీ సభ్యులు, మాజీ సర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Ongoing NSS camp