ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మంగళవారం ఉచిత బ్లడ్ గ్రూపు టెస్టులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు హెడ్మాస్టర్ లక్ష్మీనాథం ప్రోత్సాహంతో రక్త పరీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారి యొక్క భవిష్యత్తు తరాలను గుర్తించి సేవలు చేస్తున్న హెడ్మాస్టర్ లక్ష్మీనాథంకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రాధిక,వైద్య పరీక్షల బృందం, అంగన్వాడి హెల్త్ వాలంటీర్లు, విద్యార్థులు ఉన్నారు.