కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్/బ్యాక్ లాగ్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంట చంద్ర శేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 29 పరీక్ష కేంద్రాలలో 7487 మంది అభ్యర్థులకు గాను 7199 మంది అభ్యర్థులు హాజరు కాగా 287 మంది గైర్హాజరయ్యారని నిజామాబాద్ లో ఒకరు డిబార్ అయ్యారని ఆయన తెలిపారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష కు 4460...