Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 February 2025, 4:41 pm Posted by : ramakrishna

కొనసాగుతున్న ఆల్ ఇండియా క్యారం టోర్నీ

  • రెండు రౌండ్లలో విజయం సాధించిన తెలంగాణ జట్టు
  • తెలంగాణ జట్టు క్రీడాకారులు నిజామాబాద్ జిల్లా వారే

భీమ్ గల్, బతుకమ్మ : మహారాష్ట్ర లోని పూణే పట్టణంలో శివ్ ఛత్రపతి కాంప్లెక్స్ లో 2024-25 సంవత్సరానికి గాను ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్యారం టోర్నీ కొనసాగుతోంది.ఈ నెల 17 న ప్రారంభమైన ఈ టోర్నీ 22 వరకు 6 రోజుల పాటు కొనసాగానుంది. ఈ టోర్నీలో పాల్గొన్న తెలంగాణ జట్టు రౌండ్ రౌండ్లలో విజయం సాధించింది. తెలంగాణ జట్టు 17న సిమ్లా జట్టుతో, 18న హిమాచల్ ప్రదేశ్ జట్టుతో హారహోరిగా తలపడి సత్తా చాటింది. మూడవ రౌండ్ లో తెలంగాణ జట్టు మహారాష్ట్రతో తలపడనుంది. ఈ టోర్నీకి తెలంగాణ జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీదాకారులు ఇద్దరు నిజామాబాద్ జిల్లావాసులు అవ్వడం గమన్హారం.అల్ ఇండియా లెవల్ లో నిర్వహిస్తున్న ఈ తెలంగాణ జట్టులోని ఇద్దరు క్రీడాకారుల్లో ఒకరు భీమ్ గల్ పట్టణ కేంద్రానికి చెందిన నూతికట్ల సతీష్, నిజామాబాద్ పట్టణానికి చెందిన అబ్దుల్ సలీంలు కావడం విశేషం.

Ongoing All India Carrom Tournament