Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 10:29 am Posted by : ramakrishna

బిచ్కుందలో కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు

 

.  .  .  ఖాళీ అవుతున్న ప్రతిపక్ష పార్టీలు

 

  జుక్కల్, బతుకమ్మ : 

 

బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డుకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు నౌషా నాయక్ ఆధ్వర్యంలో మండల బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ జాదవ్ పండరి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే  తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో బుధవారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతారావు  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తోందని, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీలో సముచిత స్థానం, గుర్తింపు  అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయని, అందుకే ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ongoing additions to the Congress party in Bichkunda