బాలుని మృతికి కారణమైన వ్యక్తికి ఏడాది జైలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :పదహారు సంవత్సరాల బాలుని మృతికి కారణమైన ముద్దాయి షేక్ సర్దార్ అహ్మద్ కు రెండు నేరాలలో సంవత్సరం చొప్పున, మరొక కేసులో వేయి రూపాయల జరిమానా విధిస్తు నిజామాబాద్ స్పెషల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్(జూనియర్ సివిల్ జడ్జి) వడ్డి హరి కుమార్ మంగళవారం తీర్పు వెలువరించారు.వివరాలు నిజామాబాద్ నగరంలోని నాగారం 80 క్వార్టర్స్ కు చెందిన షేక్ కలందర్ తన బంధువైన పదహారు సంవత్సరాల షేక్ థౌఫిక్ తో కలిసి ఆటో డ్రైవ్ చేసుకుంటు నాగారం నుండి రహదారిపై...