తెయూ అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయించాలి
ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు విరాజ్ నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వున్న తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల ప్రత్యేక బడ్జెట్ కెటాయించాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు విరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐఎస్ఎఫ్ తెలంగాణ యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో, ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విరాజ్ పాల్గొని మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. నూతన జాతీయ...