నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవ్ నగర్ బి ఎల్ ఎన్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర గీతా పనివారుల సంఘం వ్యవస్థాపకులు అమర జీవి ధర్మ బిక్షం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. కల్లుగీత కార్మికుల ఆశాజ్యోతి కామ్రేడ్ ధర్మ బిక్షం గారి 14వ వర్ధంతి సభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతా పనివారల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ.విట్టల్ గౌడ్, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధులు కల్లు గీత కార్మికులపై సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన మహనీయుడు కామ్రేడ్ ధర్మ బిక్షం అని అన్నారు. ఆయన చివరి ఊపిరి ఉన్నంతవరకు ప్రజల కోసం గీత కార్మికుల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆయన పోరాట ఫలితంగానే కల్లు సొసైటీలు, టిఎఫ్టి కార్మికులు లైసెన్సులు ఏర్పడడం జరిగిందన్నారు. గీసే వారికి చెట్టు.. దున్నేవారికి భూమి అని నినాదంతో సంఘాన్ని ఏర్పాటు చేసి పోరాడిన మహనీయుడు కామ్రేడ్ ధర్మ బిక్షం అన్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సూర్యపేట జిల్లాను ధర్మ బిక్షం జిల్లాగా మార్చి ధర్మ బిక్షం విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య,మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు రామమూర్తి, సంతోష్ గౌడ్,నవీన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.