సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి

  . . . జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్   లింగంపేట్, బతుకమ్మ :   ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. లింగంపేట్ మండలం షట్పల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చిన్నారులకు మంగళవారం అక్షరాభ్యాసం చేయించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. చిన్నారులకు...