Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 February 2025, 6:08 pm Posted by : ramakrishna

సేవాలాల్ మహరాజ్‌ మార్గంలో నడవాలి

  • ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, బతుకమ్మ  : సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ మహానీయుడని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని పోచారం, రాంపూర్ తండా భవానీమాత ఆలయంలో శనివారం సేవాలాల్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సేవాలాల్ మహరాజ్‌ మార్గంలో నడవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భవానీమాత ఆలయ కమిటీ అధ్యక్షుడు బలరాం నాయక్‌, మోహన్‌ నాయక్‌, గోప్యా నాయక్‌, ప్రకాష్‌, హరిసింగ్‌, చందర్‌, కృష్ణారెడ్డి, బన్సీలాల్‌ విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.