Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 May 2025, 2:14 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

గాంధారి, బతుకమ్మ : సదాశివ నగర్ మండలంలోని మోడెగాం గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి చెందిన గంగుల నర్సాగౌడ్(55) మొండి సడక్ నుంచి చిన్న మల్లారెడ్డికి బైక్​పై వెళ్తున్నాడు. మోడెగాం శివారులోని రైస్​మిల్ వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీ బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో నర్సాగౌడ్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.