రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు

ఎడపల్లి, బతుకమ్మ: ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఎడపల్లికి చెందిన సాయిలు అనే వ్యక్తి కి తీవ్రగాయాలయ్యాయి. సాయిలు ద్విచక్ర వాహనంపై బోధన్ వైపు వెళ్తుండగా గురుకుల పాఠశాల బ్రిడ్జి వద్ద మహారాష్ర్ట బస్సు ఢీకొట్టింది.  ఈ ఘటనలో సాయిలుకు తీవ్రగాయాలు కాగా స్థానికులు 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.