Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 May 2025, 7:25 pm Posted by : ramakrishna

ఒకరికి ఆరునెలల జైలుశిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మోటారు బైక్ తో ఢీ కొట్టి ఒకరి మృతికి కారణమైన దూదేకుల ఆర్బాస్ కు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తు నిజామాబాద్ నాల్గవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్(జూనియర్ సివిల్ జడ్జి) వడ్డి హరి కుమార్ శుక్రవారం తీర్పు వెలువరించారు.  అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భూసారపు రాజేష్ గౌడ్ తెలిపిన వివరాలు… మాక్లూర్ మండలంలోని మానిక్ భండార్ తండా కు చెందిన మాలోత్ ప్రకాష్ తన హీరో హోండా బైక్ పై ఇంటికి వెలుతుండగా  కల్లడి గ్రామ నివాసుడైన దూదేకుల అర్బాస్  బైక్ పై అతివేగంగా, అజాగ్రత్తగా ఎదురుగా వచ్చి ప్రకాష్ బైక్ ను ఢీకొట్టాడు.  ఈ ఘటనలో అతని తలకు,ఇతర శరీర భాగాలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ప్రకాష్ బంధువులు అతనిని నిజామాబాద్ లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కై సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య చికిత్స పొందుతూ మృతి చెందాడని మాక్లూర్ పోలీసులు కోర్టులో అభియోగ పత్రం సమర్పించారు. అభియోగ పత్రం ఆధారంగా నేర న్యాయ విచారణ జరిపి, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన జడ్జి హరి కుమార్ దృవీకరించుకున్న పత్రాలు, వస్తుగత సాక్ష్యాలు పరిగణలోకి తీసుకుని ముద్దాయి అర్బాస్ మోటారు బైక్ తో ఢీకొట్టడంతో ప్రకాష్ మృతి చెందారని నిర్ధారిస్తూ ఆరు నెలల జైలుశిక్ష ఖారురు చేశారు. ప్రాసిక్యూషన్ సహాయకారిగా మాక్లూర్ పోలీస్ కానిస్టేబుల్ విషాన్ గౌడ్ ఉన్నారు.