Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 July 2025, 4:42 pm Posted by : ramakrishna

పబ్లిక్ న్యూసెన్స్ కేసులో ఒకరికి జైలు శిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : బుధవారం రాత్రి మద్యం అతిగా సేవించి రైల్వే స్టేషన్ ఏరియాలో  న్యూసెన్స్ చేసి శాంతి భద్రత లకు ఆటంకం కలిగించిన మహారాష్ట్రకు చెందిన షేక్ ఫెరోజ్ కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ ఎస్ఎచ్ఓ రఘుపతి తెలిపారు.  స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి ముందు గురువారం హాజరు పరచగా ఆ వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం జైలుకు పంపినట్లు తెలిపారు.  ఎవరైనా మద్యం తాగి పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతల ఆటంకం కలిగించిన వారిపైన  తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.