Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2025, 3:54 pm Posted by : ramakrishna

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఓ వ్యక్తికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించిందని వన్ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు. ఈనెల 18వ తేదీన రైల్వే స్టేషన్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా షేక్ జమీర్ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడన్నారు. అతడిని కోర్టులో హాజర్చగా రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపై వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.