నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో స్పెషల్ సెకండ్ క్లాస్ మెజిష్ట్రేట్ ఒకరికి ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. ఈనెల 15న నగరంలోని సాయిరెడ్డి పెట్రోల్ పంపు వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. నగరంలోని కోటగల్లికి చెందిన గుడెపు సంతోష్ మద్యం సేవించి వాహనాలు నడుపుతు పట్టుబడ్డాడు. అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి మంగళవారం స్పెషల్ సెకండ్ క్లాస్ మెజిష్ట్రేట్ ముందు హాజరు పరచగా ఐదు రోజుల జైలు శిక్ష విధించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం జైలుకు తరలించారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని, మొదటిసారి తాగి బండి నడిపితే రూ.10వేల జరిమానా లేదా జైలు శిక్ష, రెండొవసారి రూ.15వేల జరిమానా, జైలు శిక్ష లాంటి శిక్షలు ఉన్నందున ఎవరు కూడా మందు తాగి వాహనాలు నడుపవద్దని సూచించారు.