Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 9:24 pm Posted by : ramakrishna

కిడ్నాప్ కేసులో ఒకరికి సంవత్సరం జైలుశిక్ష

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ

 

ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, అక్రమంగా నిరోదించిన నేరాలలో దేవర్ల ఎల్లయ్య కు ఒక సంవత్సరం, నెల రోజుల జైలుశిక్షలు విదిస్తూ ఆర్మూర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పి. శ్రీదేవి గురువారం తీర్పు చెప్పారు. మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ఎల్లయ్య తన ఇసుక కుప్పను గట్టు భరత్ ప్రభుత్వ అధికారులకు పట్టీచ్చినాడు అనే కోపంతో 2022, నవంబర్ 14 న రాత్రి పది గంటల సమయంలో అతని ఇంటికి వెల్లి భరత్ ఇంట్లో ఉన్నాడ అని పిలవడంతో అతని భార్య నిహారిక బయటకు వచ్చి తన భర్తకు ఆరోగ్యం బాగా లేదని చెప్పడంతో వెళ్ళిపోయాడు. మల్లి కొంత సమయానికి ఎల్లయ్య తన భర్తకు ఫోన్ చేసి బయటకు రమ్మనగా వెళ్ళిపోయాడు. రాత్రి ఒకటిన్నర గంటలకు గ్రామస్థులు నీ భర్తను ఎల్లయ్య ఊరి బయట కట్టేతో కొడుతున్నాడని తెలపగ వెల్లి చూడగ ఎల్లయ్య తో పాటు అతని తండ్రి మారయ్య, తల్లి ఎల్లమ్మ, అతని చిన్నమ్మ సవిత, సవిత తల్లి రాములమ్మ లు భరత్ ను కట్టెతో కొట్టి గాయపరిచారని తెలిపి, ఎల్లయ్య భరత్ ను బైక్ పై తీసుకుని వచ్చి ఊరిలోనే ఒక చెట్టుకు కట్టేసి కొట్టి గాయపరచి హత్యయత్నం చేశారని మోర్తాడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నేర విచారణ చేసిన పోలీసులు అభియోగ పత్రాన్ని కోర్టులో సమర్పించారు. సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన కోర్టు ముద్దాయి ఎల్లయ్య పై హత్యయత్నం రుజువు కాలేదని ప్రకటించింది. కానీ భరత్ ను కిడ్నాప్ చేశాడని, అక్రమంగా నిరోదించిన నేరాలు రుజువు అయినట్లు ఆర్మూర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి శ్రీదేవి నిర్దారించారు. భారత శిక్షస్కృతీ సెక్షన్ 363 కిడ్నాప్ నేరానికి గాను ఒక సంవత్సరం కఠిన జైలుశిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించారు. అక్రమంగా నిరోదించిన నేరానికి గాను ఒక నెల జైలు శిక్షతో పాటు ఐదు వందల రూపాయల జరిమానా విధించారు. శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని జడ్జి శ్రీదేవి తమ తీర్పులో పేర్కొన్నారు. మారయ్య, ఎల్లమ్మ, సవిత, రాములమ్మ లపై నేర ఆరోపణలు రుజువు కానందున నిర్దోషులుగా విడుదల చేశారు.