Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 5:13 pm Posted by : ramakrishna

ఒకరికి ఐదు రోజుల జైలు శిక్ష

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని ఐదో టౌన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన ఒకరికి మెజిస్ట్రేట్ ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఐదో టౌన్ ఎస్ఐ ఎం.గంగాధర్ తెలిపారు. ఈనెల 12న నగరంలోని వర్నీ చౌరస్తాలో ఐదో టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాక్లూర్ మండలానికి చెందిన షేక్ ఖాజా మద్యం సేవించి వాహనం నడుపుతు పట్టుబడ్డాడని తెలిపారు. గురువారం కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. పట్టణ పరిధిలో ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే రూ.10 వేల వరకు జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండు కూడా  విదించే అవకాశం ఉంటుందని తెలిపారు.