నిజామాబాద్ మూడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దుర్గా ప్రసాద్ తీర్పు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ న్యాయస్థానం హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఏడాది ప్రారంభంలో జిల్లా మూడో అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ 11 నెలల క్రితం జరిగిన మర్డర్ కేసు విషయంలో నిందితునుడికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ తన తీర్పు వెలువరించారు.నిజామాబాద్ నగరంలో నాగారం బ్రాహ్మణ కాలోని కి చెందిన బైరగోని సతీష్ గౌడ్ కు హత్య కేసులో ఊరి శిక్ష విధిస్తూ నిజామాబాద్ మూడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దుర్గా ప్రసాద్ సోమవారం తీర్పు చెప్పారు. నాగారం ప్రాంతానికి నివాసులైన కండెల సందీప్, బైరగోని సతీష్ గౌడ్ లు స్నేహితులు.16 ఫిబ్రవరి, 2025 న ఇద్దరు మద్యం సేవించారు. సందీప్ ఆటోలో ఇరువురు ఇందల్వాయి మండలం చంద్రయాన్ పల్లి అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఆటోను, డబ్బులు స్వాధీనం చేసుకున్న వెనుక నుండి సందీప్ ను నూకి వేసి సోయి తప్పిపోయిన అతనిపై కట్టెలు వేసి తగలబెట్టి హత్య చేశాడని అభియోగాలు సతీష్ గౌడ్ పై కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు అయినట్లు నిర్ధారిస్తూ ఊరి శిక్ష కు ఖరారు చేశారు. సతీష్ గౌడ్ కు మరో రెండు నేరాలలో ఏడు, ఐదు సంవత్సరాల జైలు శిక్షలు విధించారు.