Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 July 2025, 7:05 pm Posted by : ramakrishna

హత్య కేసులో ఒకరి రిమాండ్

బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు యువకుడు దారుణ హత్యకు గురైన విషయం పాఠకులకు విధితమే. వివరాల్లోకి వెళ్ళినట్లయితే పోలీసుల కథనం ప్రకారం.. మృతుడి తల్లి అయిన అడిగేవారు గంగామణి బుధవారం ఉదయం పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో తన చెల్లెలి కొడుకు అయిన హుండేవార్ కాశీనాథ్ గత కొంతకాలంగా హైదరాబాదులో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆరు నెలల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా తనకు వరుసకు అన్న అయిన రమేష్, అతని చెల్లెలు కవిత హైదరాబాదులోని కాశీనాథ్ దగ్గరకు వెళ్లి వారం రోజులు ఉండి తిరిగి వెళ్ళిన తర్వాత కాశీనాథ్ భార్యలో మార్పులు రావడం గమనించిన కాశీనాథ్ తన అన్న అయినా రమేష్, తన భార్యకు మధ్య ఏర్పడిన అక్రమ సంబంధం వల్లనే తన భార్యలో మార్పు వచ్చిందని గమనించి మంగళవారం హైదరాబాదులోని నాచారంలో కమ్మ కత్తిని కొనుక్కొని హైదరాబాదు నుండి బయలుదేరి తెల్లవారుజామున 3:30 సమయంలో అన్న రమేష్ కిరాయి ఉంటున్న ఇంటి మేడ మీదకి వెళ్లి దాక్కొని వేచి చూసి తెల్లవారుజామున 6 గంటల సమయంలో రమేష్ రూమ్ నుండి బయటకు రాగా కాశీనాథ్ తన వెంట తీసుకు వచ్చిన కమ్మ కత్తితో విచక్షణ రహితంగా నరికి చంపినాడు. అక్కడ వీధిలోని జనాలు కాశీనాథుని పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగిందని పోలీసులు తెలియజేశారు. నిందితుడు నుంచి కమ్మ కత్తి, మొబైల్ ఫోన్, నిందితుడి, మృతుడి బట్టలు స్వాధీనం చేసుకున్నామన్నారు.కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ ఆదేశానుసారం డిఎస్పి బాన్సువాడ పర్యవేక్షణలో సిఐ బిచ్కుంద రవికుమార్, బిచ్కుంద ఎస్ఐ మోహన్ రెడ్డి కలిసి ఇట్టి కేసును త్వరితగతిన పూర్తి చేసినందుకుగాను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వీరిని అభినందించారు.