Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 8:28 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని తీర్మాన్ పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగినట్లు ఎస్ ఎచ్ ఓ సుమలత తెలిపారు. ఎల్లారెడ్డి పల్లి నుండి ఇందల్వాయి వైపు వస్తున్న ఎరుకల పోచయ్య 65 అను వ్యక్తిని వెనుకనుండి నుండి వస్తున్న మొరం టిప్పర్ అతివేగంతో వచ్చి ఢీ కొనడంతో కాలు విరిగి తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని ఇందల్వాయి పోలీస్ సిబ్బంది తక్షణమే 108 అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొరం టిప్పర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ ఓ సుమలత తెలిపారు.