Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 May 2025, 3:25 pm Posted by : ramakrishna

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో న్యాయస్థానం ఒకరికి జైలు శిక్ష విధించినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు. ఈనెల 16వ తేదీన రాత్రి సమయంలో సాయిరెడ్డి పెట్రోల్ బంక్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మాక్లూర్ మండలం దుర్గానగర్ తండాకు చెందిన వ్యక్తి మద్యం సేవించి ఆటో నడుపుతూ పట్టుబడ్డాడని అన్నారు. సదరు వ్యక్తిని స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి ఎదుట హాజరు పర్చగా న్యాయమూర్తి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని ఎస్ హెచ్ వో సూచించారు.