Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 April 2025, 6:06 pm Posted by : ramakrishna

ప్రభుత్వ ఉద్యోగిపై దాడి కేసులో ఒకరికి జరిమాన

బతుకమ్మ,మెండోరా: ప్రభుత్వ ఉద్యోగిని కొట్టి గాయపరిచిన నిందితునికి 5000/- రూ..లు జరిమానా విధిస్తూ గౌరవ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి దీప్తి వేముల శుక్రవారం తీర్పు వెలువరించారు. మెండోరా  ఎస్సై నారాయణ  తెలిపిన వివరాల ప్రకారం 2019లో మెండోరా మండలం లోని పోచంపాడ్ గ్రామానికి చెందిన బండారి మోహన్ సింగ్ అను వ్యక్తి అదే గ్రామంలో ఏఎల్ఎం గా విధులు నిర్వహిస్తున్న ఎండి అరిఫ్ హుస్సేన్ డ్యూటీలొ ఉన్న సమయంలో అనవసరంగా అతనితో గొడవ పెట్టుకుని నిండితుడు తన చేతికి ఉన్న కడియంతో ఎండి హరిఫ్ హుస్సేన్ ను కొట్టి గాయపరిచాడని మెండోరా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టగా కేసు నమోదు చేసి ఆర్మూర్  కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా ఏపీపీ జి.రామకృష్ణ  సాక్ష్యులను కోర్టులో ప్రవేశపెట్టి నేరం రుజువు చేయడంతో ప్రథమ శ్రేణి న్యాయమూర్తి దీప్తి వేముల  నిండితునికి రూ. 5000/-లు జరిమానా విధించారు.