విద్యుదాఘాతంతో ఒకరి మృతి
నవీపేట్, బతుకమ్మ : విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందిన ఘటన నవీపేట్ మండలంలోని లింగాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. లింగాపూర్ గ్రామానికి చెందిన రెంజర్ల పోశెట్టి(40) వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గ్రామానికి చెందిన కళ్లెం శివ తన వ్యవసాయ భూమిలో గల విద్యుత్ స్తంభానికి తీగలు బిగించడానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా ఉన్నదో లేదో తెలుసుకోకుండా విద్యుత్ స్తంభం ఎక్కి తీగలను తాకాడు. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో...