బతుకమ్మ, భిక్కనూరు: తాగుడుకు బానిసై ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దమల్లరెడ్డి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయితేజ(23) గత రెండు సంవత్సరాల నుండి తాగుడుకు బానిసై తిరుగుతూ ఉండేవాడు అప్పుడప్పుడు అతనికి ఆరోగ్యం సరిగా లేక తన ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా దావఖానకు తరలించడం జరిగిందన్నారు.