మద్యం మత్తులో కాలువ గట్టు నుండి జారిపడి ఒకరి మృతి

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామానికి చెందిన  మెత్రి రవి(35) అను వ్యక్తి గురువారం సాయంత్రం కాలకృత్యాలకు అని వెళ్లి మద్యం మత్తులో పొలం కాలువ గట్టు నుండి జారిపడి మృతి చెందినట్లు ఎస్సై సాయన్న పేర్కొన్నారు. మృతుని భార్య మేత్రి సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న వెల్లడించారు.