Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 March 2025, 7:37 pm Posted by : ramakrishna

చేపల వలలో చిక్కుకొని ఒకరి మృతి

భీమ్ గల్, బతుకమ్మ : ప్రతి రోజు చేపలు పట్టి అమ్ముకొని జీవనం కొనసాగించే తోపారం బొర్రన్న(49) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చేపల వలలో చిక్కుకొని నీటమునిగి మృతి చెందాడు. మృతుని కుటుంబీకురాలు ఎల్లల సిద్దపల్లి లక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సిద్దపల్లి గ్రామంలో నివసిస్తున్న తోపారం బొర్రన్నకు పెండ్లి కానందున ఒంటరిగా జీవిస్తున్నాడు. ప్రతి రోజు చేపలు పట్టుకొని జీవనం కొనసాగిస్తున్న ఆయన రోజు మాదిరిగా మంగళవారం చెరువులోకి చేపలు పట్టడానికి పందిరి నగేష్, తోపారం గంగాధర్ తో కలిసి వెళ్లాడు. చేపలు పడుతుండగా చేపల వలలో చిక్కుకొని నీటిలో మునిగి మృతి చెందాడు. కుటుంబీకురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.