Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 June 2025, 3:54 pm Posted by : ramakrishna

మంజీరా నదిలో పడి ఒకరి మృతి

బతుకమ్మ, కోటగిరి : మంజీరా నదిలో కాలుకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి  ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన పోతంగల్ మండలం కోడిచర్ల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. వరి నాట్ల వేయడంకోసం వచ్చిన బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు కల్లూరు గ్రామానికి  రాగా రాజేష్ కుమార్ సహాని(32) అనే వ్యక్తి  ఆదివారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం కోడిచెర్ల శివారులోని మంజీరా నది వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో పడడంతో అతనిని బయటకు తీసి చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆయన తెలిపారు. మృతుడి తమ్ముడు వీరేంద్ర కుమార్ సహాని(25) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.