గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

భిక్కనూరు, బతుకమ్మ:  బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఎంఎస్ఎన్ కంపెనీ దగ్గర గురువారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కంచర్ల గ్రామానికి చెందిన రామ్ చందర్ (52) ను ఎంఎస్ఎన్ కంపెనీ వద్ద దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో స్థానికులు 108 లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.