Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 September 2025, 9:58 pm Posted by : ramakrishna

ప్రమాదవషాత్తు చెరువులో పడి ఒకరి మృతి

మోస్రా, బతుకమ్మ : మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వడ్ల అశోక్ (40 ) అనే వ్యక్తి ప్రమాదవషాత్తు చింతకుంట గ్రామ చెరువులో పడి మృతి చెందినట్లు వర్ని పోలీసులు వెల్లడించారు. వడ్ల కులానికి చెందిన ఆయన చేపలు పట్టేందుకు స్నేహితులతో కలిసి వెళ్లి ప్రమాదవషాత్తు చెరువులో పడినట్లు మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వర్ని ఎస్ ఐ మహేష్ పేర్కొన్నారు.