Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 September 2025, 11:57 am Posted by : ramakrishna

చికిత్స పొందుతూ ఒకరి మృతి

నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ :  నగరంలో జిల్లా జనరల్ చికిత్స పొందుతున్న వ్యక్తి సోమవారం రాత్రి మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తిని నగరంలోని దొడ్డి కొమురయ్య కాలనీకి చెందిన ఎండీ షకీల్ (40) గా గుర్తించారు. ఈనెల 14న రాత్రి షకీల్ పొరుగింటి వారితో గొడవపడ్డాడు. ఈ గొడవతో స్థానికంగా ఉండే భార్యాభర్తలు,  మరో మహిళ కలిసి షకీల్ ను చితక బాదారు. ఘటనలో  గాయపడ్డ షకీల్ సోమవారం జనరల్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లాడు.  అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. షకీల్ మృతికి  పొరిగెంటివారే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు.