Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2025, 6:01 pm Posted by : ramakrishna

ప్రమాదవశాత్తు ఒకరు మృతి

మాక్లూర్, బతుకమ్మ : మాక్లూర్ మండలంలోని బోర్గం కే గ్రామంలో కాలుజారి డ్రైనేజీలో పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సంగే వార్ ప్రకాష్(44) కుట్టు మిషన్ చేస్తూ ఉండేవారు.  ఆదివారం రాత్రి తన ఇంట్లో నుంచి లేచి మూత్రవిసర్జన చేయడానికి బయటకెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో డ్రైనేజీ పై కాలు జారటంతో ఒక్కసారిగా డ్రైనేజీలో పడిపోయాడు. ఇంట్లో ఉన్న భార్య సంఘే వార్ లక్ష్మి చూసి వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిపారు. భార్య సంగీ వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై రాజశేఖర్ తెలిపారు.